కృష్ణ శతకం

  1. ప్రజల హింస పెట్టు ప్రభువులేలను భువి?
    పీచమణచవలయు పెచ్చుగాను
    నరకుని హతమార్చి నవ్యకాంతుల నిచ్చు
    గీతదాత నీకు కేలుమోడ్తు
  2. అటుకులైననేమి? అవి ఇష్టమైనచో
    వజ్రమైననేమి? భక్తి లేక
    భక్తుడయిన వాడె భగవంతునకు ప్రీతి
    గీతదాత నీకు కేలుమోడ్తు
  3. సత్యమయిన విద్య సాందీపని వలన
    దక్కెనయ్య నీకు తన్మయమున
    కోటి విద్యలయిన గోవిందు బోధలే
    గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply