Kotagiri | ఒక్క సారి ఓటేసి గెలిపిస్తే..
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థి హరిపటేల్…
Kotagiri | కోటగిరి,(పోతాంగల్) డిసెంబర్6(ఆంధ్ర ప్రభ): మండల పరిధిలోని హంగార్గా గ్రామంలో స్థానిక ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా హరిపటేల్ మాట్లాడుతూ.. ఒక్కసారి ఓటేస్తే మీకు రుణపడి మీ సేవ చేస్తానని అభ్యర్థి పేర్కొన్నారు. మీ అమూల్యమైన ఓటును దుర్వినియోగం చేయకుండా గ్రామ అభివృద్ధి ప్రజాసేవ చేసే అభ్యర్థులను గుర్తించి గెలిపించి మీ సేవలను అందుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులను గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు పెడతానని స్వలాభం లేకుండా మీ వెంటే ఉంటూ మీ సమస్యలకు పరిష్కారం చేస్తూ మీలో ఒకటై ఉంటానని అన్నారు.మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకే ఓటేసి న్నాను గెలిపించాలని వారు ఓటర్లతో కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు.

