Kotabommali | ఆంధ్రప్రభది గౌరవప్రదమైన స్థానం

Kotabommali | ఆంధ్రప్రభది గౌరవప్రదమైన స్థానం

  • రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గోవిందరాజులు

Kotabommali | కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : తెలుగు దినపత్రికల్లో ఆంధ్రప్రభది గౌరవప్ర‌దమైన స్థానమని రాష్ట్ర కళింగ వైశ్య సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు. స్థానిక బోయిన గోవిందరాజులు కళింగ వైశ్య కల్యాణ మండపంలో ఆంధ్రప్రభ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈ రోజు ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరి ఆంధ్రప్రభ నాణ్యమైన వార్తలు అందిస్తోందన్నారు. 1938 ఆగస్టు 15న ప్రారంభమైన ఆంధ్రప్రభ నాటి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, కొత్తమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోరాడ చిన్న గోవిందరావు, పీఏసీఎస్ డైరెక్టర్ సకలాభక్తుల రాంకుమార్, ఎస్ఎంసీ చైర్మన్ బోయిన వెంకటరమణ మూర్తి, తంగుడు కృష్ణస్వామి, అనపాన శ్రీనివాసరావు, లొట్టి రాహుల్, తంగుడు రాజీవ్, ఆంధ్రప్రభ విలేకరి జి. పాపారావు పాల్గొన్నారు.

Leave a Reply