Komatireddy | అమ్మలా అందుబాటులో ఉంటా..
Komatireddy, రామన్నపేట, ఆంధ్రప్రభ : అమ్మలా అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ (Congress) పార్టీ సర్పంచ్ అభ్యర్థి బండ సరోజ అంజిరెడ్డి తెలిపారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో జనంపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని.. ఆమె స్పష్టం చేశారు. ప్రజా సేవకు సిద్ధమై గ్రామంలోని ప్రతి వార్డు గడపగడపకు ఆమె ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు.

