komatireddy | ఉపాధ్యాయుల మృతి బాధాకరం

komatireddy | ఉపాధ్యాయుల మృతి బాధాకరం
- రోడ్డు ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి
komatireddy |ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలో కారు బోల్తా పడి కస్తూర్బా గాంధీ ఏఎస్ఓ కల్పన, రావులపల్లి జీహెచ్ఎం గీత మృతి చెందడం బాధాకరమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్నవారు తుంగతుర్తి జీహెచ్ఎం ప్రవీణ్, రావులపల్లి జీహెచ్ఎం గీత, అన్నారం జీహెచ్ఎం సునీతరాణి, కస్తూర్బా గాంధీ ఏఎస్ఓ కల్పన అని ప్రాథమిక వివరాలు మంత్రి దృష్టికి వచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన ఆయన వైద్య అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
