రాజస్థాన్ రాయల్ కు కోలకతా ఆఫర్..?

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ను అతను వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అతని ట్రేడింగ్ విషయంలో రోజుకో వార్త బయటకొస్తోంది. శాంసన్పై పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) అతన్ని తీసుకుం టుందని వార్తలు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె లేదా రవీంద్ర జడేజాలలో ఒక్కరిని ఇచ్చి శాంసన్ ను తీసు కోవాలని రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ ఇచ్చిందని, అందుకు సీఎస్కే అంగీకరించలేదని కథనాలు వెలువడ్డాయి. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)(కేకేఆర్) కూడా శాంసన్పై ఆసక్తి కనబ రుస్తోంది. ఈ ఏడాది కేకేఆర్కు అజింక్య రహానె కెప్టెన్గా వ్యవ హరించాడు. అయితే, వచ్చే సీజన్ కోసం ఆ జట్టు కొత్త కెప్టెన్ ను అన్వేషిస్తున్నట్టు సమాచారం. శాంసన్ ను తీసుకుని అతనికి పగ్గాలు అప్ప గించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కేకేఆర్లో భారత వికెట్ కీపర్ లేని లోటు కూడా పూడ్చినట్టు అవుతుంది.

రాజస్థాన్ ముందు కేకేఆర్ ఓ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తోంది. తమ జట్టులోని యువ ఆటగాళ్లు రఘువంశీ లేదా రమణీప్ సింగ్ లలో ఒక్కరిని ఇచ్చి మిగిలిన మొత్తాన్ని నగదు కూడా ఇస్తామని ప్రతిపాదించినట్టు సమాచారం. గత వేలానికి ముందు రాజస్తాన్ రూ.18 కోట్లకు శాంసన్ ను రిటైన్ చేసుకుంది. అతడిని తీసుకోవాలనుకునే జట్టు ఆ ధరకు సరిపడా ప్లేయర్లను ఇవ్వాలి.. లేదంటే నగదు చెల్లించాలి. మెగా వేలంలో కేకేఆర్ రఘువంశీని రూ.3 కోట్లకు, రమణ్ దీప్ సింగ్ను రూ.4 కోట్లకు తీసుకుంది. శాంసనక్కు బదులు వీరిద్దరిలో ఎవరిని రాజస్థాన్ కు ఇచ్చినా కేకేఆర్ ఇంకా రూ. 15 లేదా రూ.14. కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు కేకేఆర్ సిద్దంగానే ఉన్నట్టు సమాచారం. ఈ సీజన్లో రఘవంశీ ఆకట్టుకున్నాడు . 11 ఇన్నింగ్స్ 300 రన్స్ చేశాడు. కేకేఆర్ ఫ్యూచర్ స్టార్ అతను ఎదిగే అవకాశాల ఉన్నాయి. కాబట్టి, కోల్కతా అతన్ని వదులుకోక పోవచ్చు. ఒకవేళ శాంసన్ కోసం ద లుకున్నా ఆశ్చర్యపోనవ సరం లేదు. శాంసన్ను తీసుకుంటే ఓపెనర్గా కూడా దించొచ్చు. దీనిద్వారా అదనపు విదేశీ బౌలర్ను తీసుకుని బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసుకోవచ్చు. అన్ని విధాలుగా శాంసన్ను తమకు మంచి ఆప్షన్ అని కేకేఆర్ భావిస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేయకుముందు 2012లో కేకేఆర్ జట్టులో భాగం. అయితే, ఆ సీజన్లో లో అతను ఒక్క మ్యాచ్ కూడా
ఆడలేదు. 2013లో వేలంలోకి వదిలివేయగా రాజస్థాన్ తీసుకుంది.

Leave a Reply