Kodur | 3% వడ్డీ రాయితీ..

Kodur | 3% వడ్డీ రాయితీ..
Kodur కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి లోనుదారులకు 3% వడ్డీ రాయితీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయాని, వి. కొత్తపాలెం పిఏసీఎస్ పరిధిలో 129 మంది రైతులకు రాయితీ క్రింద రూ.2,90,533/- రూపాయలు వచ్చిందని తెలియచేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కోడూరులోని కృష్ణ కోపరేటివ్ బ్యాంక్ లో ఆ నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్టు వి.కొత్తపాలెం పిఎసిఎస్ చైర్మన్ రేపల్లె పిచ్చేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
