KKR vs RR | కేకేఆర్ పై పోరాడి ఓడిన రాజ‌స్థాన్..

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాజ‌స్థాన్ తో జ‌రిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం వృధా అయ్యింది. రియాన్ పరాగ్ 45 బంతుల్లో 95 పరుగులు దంచేశాడు. ఆఖర్లో శుభం దూబే (24) కూడా బౌండరీలతో చెలరేగాడు. అయితే, 20వ ఓవర్లో 22 పరుగులు కావాల్సి ఉండగా.. 21 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో కేకేఆర్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది.

రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ (34), షిమ్రాన్ హెట్మెయర్ (29), శుభం దూబే (25 నాటౌట్) కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (95) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణ, మోయిన్ అలీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Leave a Reply