ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కతా – రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో.. రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్.. బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది. కోల్ కతా బౌలర్ల ధాటికి రాజస్థాన్ కీలక బ్యాటర్లంతా స్వల్ప పరుగులకే పెవిలియర్ చేరారు.
దీంతో, ఆర్ఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ ఒక వికెట్ తీయగా… వైభవ్, హర్షిత్ రాణా, మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఆర్ఆర్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (29) , సంజు (13).. కెప్టెన్ రియాన్ పరాగ్ (25) పరుగులకే వెనుదిరిగారు. నితిష్ రాణా (8), వానిండు హసరంగా (4), శుభం దూబే (9), షిమ్రాన్ హెట్మెయర్ (7) విఫలమయ్యారు. ఇక జాఫ్రా ఆర్చర్ (16) పరుగులు చేయగా.. ధ్రువ్ జురేల్ (33) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక 152 పరుగుల విజయలక్ష్యంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఛేజింగ్ కు దిగనుంది.