ఈరోజు కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ చేపట్టగా.. టాపార్డర్ బ్యాటర్లు విజృంభించారు. దాంతో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69), ప్రభసిమ్రాన్ సింగ్ (49 బంతుల్లో 83) అర్ధ శతకాలతో రెచ్చిపోయారు. కేకేఆర్ వేసిన చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ… 12 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా భారీ పరుగులు సాధించారు. వీరిద్దరూ కలిసి 72 బంతుల్లో తొలి వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇక వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (16 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకోగా.. గ్లెన్ మాక్స్‌వెల్ (7), మార్కో జాన్సన్ (3) నిరాశపరిచారు. అయితే, గ్లెన్ మాక్స్‌వెల్‌ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 7 సార్లు టీ20 ఇన్నింగ్స్‌లలో తలపడగా.. చక్రవర్తి బౌలింగ్‌లో మాక్స్‌వెల్ 5 సార్లు అవుట్ అయ్యాడు. జోష్ ఇంగ్లిష్ (11 ) పరుగులతో నాటౌట్ గా నిలిచిచాడు.
కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా.. వరణ్ చక్రవర్తి, రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక సొంత మైదానంలో 202 పరుగుల భారీ టార్గెట్ తో కేకేఆర్ ఛేజింగ్ కు దిగనుంది.