Kiran | గ్రామాభివృద్ధే లక్ష్యం
నేరడిగుంట సర్పంచ్ అభ్యర్థి ఒగ్గుసాయి కిరణ్
Kiran | సంగారెడ్డి ప్రతినిధి, జోగిపేట, ఆంధ్రప్రభ : గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని నేరడి గుంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఒగ్గుసాయి కిరణ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం నేరడిగుంటలో ఆంధ్రప్రభ బ్రోచర్ ను ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ… తనను గెలిపిస్తే గ్రామస్తుల కోసం తాను కొత్త పథకాలు అమలు చేసేందుకు సొంత మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. గ్రామస్తులు తమ అమూల్యమైన ఓటును నిజమైన సేవకుడిగా పనిచేసే తనకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ప్రతినిధి బృందంతో పాటు స్థానిక యువకులు పాల్గొన్నారు.

