Kiran Sai 12 | ఎస్ ఎల్ బీసీ కాలువలో పడి…

Kiran Sai 12 | ఎస్ ఎల్ బీసీ కాలువలో పడి…

Kiran Sai 12 | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు ఎస్ ఎల్ బిసి కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం నల్లగొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీ చెందిన పర్వతం కిరణ్ సాయి (12) ఏడో తరగతి చదువుతున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితుడు త్రివిక్రమ్ తో కలిసి పట్టణ పరిధిలోని గల ఆర్జాలబావి శివారులో ఉన్న ఎస్ఎల్బీసీ కాలువ వద్దకు వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలు జారి నీటిలో మునిగి చనిపోయాడు. మృతిని తండ్రి వేణుగోపాల చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కిరణ్ సాయి ప్రాంతం విద్యుత్ నగర్ కాలనీలో, అమ్మమ్మ ఉండే జామమసీద్ అశోక్ నగర్ లో, అతను చదివే పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Kiran Sai 12 |

click here to read more : Number 304 | ఆత్మహత్యాయత్నం

click here to read more

Leave a Reply