KIRAN | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపెడతా

KIRAN | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపెడతా

KIRAN | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా మండలంలోని బిక్కుతాండ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తే.. అభివృద్ధి ఏంట‌న్న‌ది చేసి చూపెడతానని సర్పంచ్ అభ్యర్థి రాథోడ్ అర్చన (కిరణ్) అన్నారు. త‌న‌కు కేటాయించిన‌ బంతి గుర్తుపై పై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. త‌న వంతు నిస్వార్థ సేవలు అందిస్తానని ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులను తీసుకువచ్చి ముత్తునూరు – గిన్నెరా రోడ్డును పూర్తి చేయడానికి త‌న వంతు ప్రయత్నిస్తానన్నారు.మహిళలతో కలిసి భిక్కు తాండ ఇంటింటా ప్రచారం చేశారు.

Leave a Reply