- శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఎస్‌పీఐ కొత్త బహుమతి అందజేత
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ(Allagadda) మండలం అహోబిలం పుణ్య క్షేత్రానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు లగ్జరీ కియో కారును విరాళంగా అందజేశారు. రూ.20 లక్షలకు పైగా విలువచేసే కియా సెవెన్ సీటర్(Kia seven seater) కారును ఆదివారం అందజేశారు.
దేవస్థానం మనియార్ వీ.ఎల్. ఎన్. సౌమ్యనారాయణకు ఈ తాళాలను అందజేశారు. నూతన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు దేవస్థానానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కియో కారుకు ప్రత్యేక పూజలు(special pujas) నిర్వహించారు.
అనంతరం ఎస్బీఐ అధికారులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి తీర్థ ప్రసాదాల అందజేసి వేదపండితులు ఆశీర్వచనం(blessings) పలికారు.
ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఇండియా ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం(shrine) శ్రీశైలం దేవస్థానానికి ఇప్పటికే కియో సెవెన్ సీటర్స్ కారును విరాళంగా ఇచ్చామన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ సహాయాన్నిచేసినట్లు తెలిపారు. అహోబిలం(Ahobilam) పుణ్యక్షేత్రం కూడా దేశంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రం అన్నారు.