Khanapur MLA | అటవీశాఖ అభ్యంతరతో ఆగిపోతున్న అభివృద్ధి

Khanapur MLA | అటవీశాఖ అభ్యంతరతో ఆగిపోతున్న అభివృద్ధి
- అసెంబ్లీలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్
Khanapur MLA | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గం టైగర్ జోన్ పరిధిలో ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తూ పంచాయతీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం లో ఆదివాసీలకు మంజూరైన ఇండ్లను నిర్మించకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇస్లాంపూర్ లో రైతులు పండించిన పత్తిని మార్కెట్ కు తీసుకువెళ్లడానికి రోడ్డు సరిగా లేదని, అటవీ హక్కు భూమిని దున్నుతున్న రైతులపై అటవీశాఖ అధికారులు కేసు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల నిర్మాణ పనులను అటవీ అధికారులు అడ్డుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
