ఖమ్మం : రైలు వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యం అందించడానికి శరవేగంగా కొనసాగుతున్న పనులు భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపట్టడం ద్వారా గొప్ప పరివర్తన దిశగా పురోగమిస్తుంది. “అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ” (ఏ.బి.ఎస్.ఎస్.) కింద, తెలంగాణ వ్యాప్తంగా 40రైల్వే స్టేషన్‌లను రూ.2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్ది చేయబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 2023, ఫిబ్రవరి 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పథకానికి మరింత ప్రోత్సాహం లభించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను ఈ జాబితాలో చేర్చారు. వాటితో పాటుగా జంట నగరాల ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఇతర రైలు టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి చర్లపల్లి స్టేషన్ సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది. నగర ప్రజల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ టెర్మినల్‌గా అవతరించింది.

రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, రైల్వే స్టేషన్‌ల ప్రోత్సాహాన్ని పెంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది.
ఖమ్మం రైల్వే స్టేషన్ గురించి సంక్షిప్త సమాచారం:
భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏ.బి.ఎస్.ఎస్.) కింద పునరాభివృద్ధి చేయబడుతున్న తెలంగాణలోని 40రైల్వే స్టేషన్లలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఒకటి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ 19వ శతాబ్దం నాటి గొప్ప చరిత్రతో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్.జి.ఎస్.ఆర్) ప్రాజెక్టులో భాగంగా స్థాపించబడి హైదరాబాద్‌ను విజయవాడతో అనుసంధాన్నిస్తుంది. బ్రిటిష్ కాలంలో సమీపంలోని గనుల నుండి బొగ్గు, సున్నపురాయి, ఇతర ఖనిజాలను రవాణా చేయడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం తర్వాత, నూతన రైళ్లను ప్రవేశపెట్టడంతో స్టేషన్ ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది.
ఖమ్మం రైల్వే స్టేషన్ ఢిల్లీ – చెన్నై, హైదరాబాద్ – విజయవాడ రైల్వే లైన్ల కూడలిలో వ్యూహాత్మకంగా ఉండి ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణించే రైళ్లకు కీలక పాత్రను పోషిస్తుంది. ఈ స్టేషన్ సమీపంలోనున్న సింగరేణి కాలరీలు ఉండడం వలన బొగ్గుకు ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తూ సిమెంట్, ఉక్కు, కాగితపు పరిశ్రమలు వంటి అనేక పరిశ్రమలతో స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహద పడుతుంది. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్ దాదాపు రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్ కండిషన్డ్ వేచియుండు గదులు, ఎస్కలేటర్లు, మెరుగైన ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో మరింత పునరాభివృద్ధి చెందుతోంది.

- నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3)గా వర్గీకరించబడిన ఖమ్మం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
- కాజీపేట—విజయవాడ సెక్షన్‌లో నున్న ఈ స్టేషన్ రూ 29.64 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 12,988 మంది ప్రయాణీకుల రాకపోకలతో ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.
- ఖమ్మం స్టేషన్‌లో దాదాపు 83 రైళ్లు ఆగుతాయి.
- ఈ స్టేషన్ ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లకు న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్ మరియు తిరుపతి వంటి అనేక గమ్యస్థానాలకు స్టాప్‌లను కలిగి ఉంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన పనులు :
స్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి.
ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు.
ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతో పాటు 2 లిఫ్టులు & 2 ఎస్కలేటర్ల ఏర్పాటు.
ప్లాట్‌ఫామ్ ఉపరితల మెరుగుదలలు.
ప్లాట్‌ఫారమ్‌పై అదనపు కప్పు ఏర్పాటు.
ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదలలు, దివ్యాంగుల సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం.
వెయిటింగ్ హాల్ అభివృద్ధి.
స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడానికి స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం,ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్ ప్రాంగణం మెరుగుదల.
స్టేషన్ ప్రాంతాలలో కళలు మరియు సంస్కృతి చిత్రీకరణ.
ప్రయాణీకులకు అనుకూలమైన సంకేతాలు, రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి.
ఇప్పటివరకు మొత్తం 45 శాతం పైగా పనులు పూర్తయ్యాయి.
అన్ని పనులు ఏకకాలంలో పురోగతిలో ఉన్నాయి మరియు రాబోయే కొన్ని నెలలలో పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించారు,ఇప్పటివరకు పూర్తయిన పనులు, జరుగుతున్న పనులు,
12 మీటర్ల వెడల్పు గల గ్యాంగ్‌వే తయారీ, నిర్మాణం అండ్ షీటింగ్ పూర్తి.
జనరల్ వెయిటింగ్ హాల్ పని పూర్తి.
రిటైరింగ్ గదులు ఫాల్స్ సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ పూర్తి.
తాత్కాలిక బుకింగ్ ఆఫీస్ పని పూర్తి.
ప్లాట్ ఫారం-1 అండ్ ప్లాట్ ఫారం-2 పై 7 స్పాన్లలో సి.ఓ.పి-15 స్పాన్ల కోసం స్తంభాలు అండ్ పర్లిన్ల నిర్మాణం పూర్తి.
12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) ర్యాంప్‌ల తయారీ మరియు నిర్మాణం పురోగతిలో ఉంది
లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లకు ఫౌండేషన్ పనులు అండ్ తయారీ పురోగతిలో ఉన్నాయి.
ఎ.సి లాంజ్ కోసం గోడల ప్లాస్టరింగ్ పనులు, సి.ఓ.పిల గట్టర్ ఫిక్సింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.