- ట్రావెల్స్ యజమానికి ఊరట
కర్నూలు బ్యూరో, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) : కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో అరెస్టయిన వి.కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్‌కుమార్‌కు కోర్టు ఊరట కల్పించింది.
ఈ కేసులో విచారణ అనంతరం పోలీసు అధికారులు వేమూరి వినోద్‌కుమార్‌ను న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, మొదట జేఎఫ్‌సిఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, పోలీసులు మోపిన అభియోగాలు స్టేషన్ బెయిల్ పరిధిలోకి వస్తాయని వేమూరి తరఫు న్యాయవాది నాగలక్ష్మి స్పెషల్ మొబైల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆమె వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అనూష రిమాండ్‌ను రద్దు చేస్తూ, వేమూరి వినోద్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేశారు.

