KESINENI | అభివృద్ధి బాటలో ఆంధ్ర…

  • KESINENI | ఏపీకి పెట్టుబడి వెల్లువ…
  • తరలివస్తున్న పెద్దపెద్ద కంపెనీలు
  • ఒప్పందాలే కాదు శంకుస్థాపనలు కూడా…
  • లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • యువతలో నూతన ఉత్తేజం నింపిన సీఐఐ సమ్మిట్
  • చంద్రబాబు చాతుర్యంతో ఏడాదిలో గాడిన పడిన పాలన
  • జగన్‌ది అరాచక పాలన
  • అభివృద్ధికి కేరాఫ్ గా చంద్రబాబు పాలన
  • విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్
  • అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం
  • ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య..

KESINENI | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షిత, చాతుర్యం కారణంగా ఏడాదిన్నరలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్‌ పేర్కొన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పెట్టుబడులు ప్రవాహంలో వస్తున్నాయన్న ఆయన కేవలం ఒప్పందాలే కాకుండా శంకుస్థాపనలు కూడా చకచకా జరుగుతున్నాయన్నారు. జగన్ ఐదేళ్లు అరాచక పాలన చేస్తే, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు పాలన నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలోని గురు నానక్ కాలనీలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎంపీ కేసీనేని శివనాధ్ మాట్లాడుతూ విశాఖ లో జరిగిన సదస్సులతో రూ.13.50 లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీకి రావడం శుభ పరిణామమ‌న్నారు.

KESINENI | ఏపీ అన్నివిధాలా అభివృద్ధి చెందడం ఖాయం.

చంద్రబాబు లోకేష్ కృషి కారణంగా ఏపీ రూపురేఖలు మారతాయని, ఎరో స్పేస్, డ్రోన్, ఆక్వా, క్వాంటమ్, ఐటీ , డేటా సెంటర్లు ఏపీకి వస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పిన ఆయన ఒప్పందాలే కాదు. ఈసారి కొన్ని కంపెనీలకు శంకుస్థాపన కూడా జరిగిందని తెలిపారు. యువతలో నూతన ఉత్తేజం వచ్చిందని, ఇంకా సిగ్గు లేకుండా మేమే తెచ్చామని వైసీపీ ప్రచారం చేసుకోవడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం ఉన్న కంపెనీలు కూడా మూత పడ్డాయని, పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. చంద్రబాబుపై నమ్మకం తో మళ్లీ పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని, వచ్చే రెండేళ్లల్లో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతుందని, యుతవకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరామ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన చూసి పారిశ్రామిక వేత్త ల్లో నమ్మకం వచ్చిందన్నారు. ముందుగా విదేశాలకు వెళ్లి లోకేష్ పెట్టుబడి దారుల్లో నమ్మకం కలిగించారని, ముందు చూపు ఉన్న నాయకుడు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే ఒక చక్కటి ఉదాహరణగా చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు రాబోతున్నాయని, జగ్గయ్యపేటలో పరిశ్రమలు అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండని, చెప్పిన ఆయన అబద్దాలు చెప్పే వారిని ప్రజలే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

KESINENI | పరిశ్రమల రాక ద్వారా అభివృద్ధి సాకారం

తూర్పు శాసనసభ్యుడు గద్ద రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత ఐదేళ్లల్లో వైసీపీ అరాచక పాలన అందరూ చూశారని, అనేక పరిశ్రమలు రాకుండా బెదిరించారని, అమర్ రాజా, కియా మోటార్స్ ఉప కేంద్రం రాకుండా చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముందు చూపు వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చాయన్న ఆయన ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు రావడం ద్వారా అభివృద్ధి సాకారం అవుతుందన్నారు. చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్, మోడీ, లోకేష్ లున్నారని, కొంతమంది అబద్దాలు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు. అయినా రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడే వైసీపీ నీచ రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టాలని 11 సీట్లతో‌ పరిమితం చేసినా వారికి బుద్ధి రాలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి అమ్మ ఆలయంలో రాజకీయాలు వద్దు..

https://twitter.com/Prabhanews_

Leave a Reply