jagityala | మోతే రోడ్డులో ఏర్పాట్లు..

jagityala | మోతే రోడ్డులో ఏర్పాట్లు..

లక్షమంది హాజరు లక్ష్యం
jagityala | జగిత్యాల, ఆంధ్ర ప్రభ : జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతుండగా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో ఈ సభ జరగనుంది. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Former Minister Jeevan Reddy) బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సభ ఏర్పాట్లలో భాగంగా జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కలిసి వివిధ ప్రదేశాలను పరిశీలించారు.

జిల్లా కేంద్రంలోని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్ (Mothe Road), ఇతర కాలేజీ ప్రాంగణాలను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు.పాల్గొన్నారు

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) మాట్లాడుతూ… ఈనెల 20న మోతే రోడ్డులో జరిగే కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ జరుగుతుందని తెలిపారు. సుమారు లక్షమంది హాజరు కావాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కేసీఆర్ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన శేష జీవితంలో కేసీఆర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ రావాలని, రేవంత్ రెడ్డి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Leave a Reply