ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలం కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
