మాగంటి సునీతకు బీఫామ్‌ అందజేసిన కేసీఆర్‌..

గజ్వేల్‌ (ఉమ్మడి మెదక్‌ జిల్లా), ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) బీఫామ్‌ అందజేశారు.

మంగళవారం గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌ మండలం ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్‌ను సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును కూడా అందజేశారు.

అలాగే భారీ మెజార్టీతో గెలుపొందాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్‌ కూతుళ్లు కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌, అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply