Kavitha | ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులకు వెపన్స్ ఇవ్వాలి

Kavitha | ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులకు వెపన్స్ ఇవ్వాలి
- తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత
Kavitha | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులకు మళ్లీ వెపన్స్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే సంతోష్‌రావు అని, ఆయన వల్లే గద్దర్‌లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సి వచ్చిందని కవిత అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి అని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదన్నారు. సిట్ పిలవడం సరే కానీ.. ఏం శిక్షలు పడతాయో చూడాలన్నారు. నిమ్స్‌లో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం కవిత మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, నేరగాళ్లు విచ్చలవిడితనంగా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతోందని, మహిళా అధికారులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నేరస్థులకు చట్టాలన్నా, పోలీసులన్నా భయం లేకుండా పోయిందని మండిపడ్డారు.



