Kavitha | పురపాలిక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదు

Kavitha | పురపాలిక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదు
Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదన్నారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాలేదన్నారు. పుర ఎన్నికల్లో ఎవరు కోరినా.. మద్దతు ఇస్తామని తెలిపారు. తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని కవిత పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు తుదిదశకు చేరుతుందనే నమ్మకం లేదన్నారు. కావాలనే హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఊసే ఎత్తకుండ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. కేటీఆర్ సికింద్రాబాద్ జిల్లా చేయమనడం పెద్ద జోక్ అన్న కవిత 10 ఏండ్లు అధికారంలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజనలో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
