కౌతాళం, ఆంధ్రప్రభ : తుఫాను కారణంగా నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ . అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం నది తీరా గ్రామాలైన నదిచాగి , మెలిగనూరు,మురళి, కుంభలోనూరు గ్రామాలలో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోవు మెంథా తుఫాన్ కారణంగా అధిక వర్షపాతం కారణంగా మట్టిమిద్దల వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.
రైతులు కరెంటు మోటార్లకు ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు కరెంటు షాక్ కు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప ఇండ్లలో నుంచి అనవసరంగా బయటికి వెళ్లరాదని,పశువులు,గొర్రెల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తమకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.ఇందులో భాగంగా పోలీసులు పాల్గొన్నారు.

