Karunakar Reddy | ఇది రాజకీయ ప్రతీకారమే..

Karunakar Reddy | ఇది రాజకీయ ప్రతీకారమే..
- పరకామణి విచారణ ఏకపక్షం
- న్యాయస్థానాలపై నాకు గౌరవం ఉంది
- విచారణ నిష్పక్షపాతంగా జరగలేదు
- భూమన కరుణాకర్ రెడ్డి
Karunakar Reddy | తిరుపతి, ఆంధ్రప్రభ : పరకామణి కేసు విచారణ పూర్తిగా ఏకపక్షంగా, రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించబడిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy) విమర్శించారు. న్యాయస్థానాల పట్ల తనకు గౌరవం ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశించిన విధంగా విచారణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దొంగల ముద్ర వేయడానికి కుట్ర
తెలుగుదేశం, కూటమి నేతలు ఆధారాలు ఉన్నాయని ప్రచారం చేసినప్పటికీ, వారిని విచారణకు పిలవకుండా తమపై మాత్రమే ఆరోపణలు మోపడం విచిత్రమని భూమన(bhoomana) మండిపడ్డారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడానికే మూడు నెలలుగా ప్రయత్నాలు జరిగాయి. ఆధారాలు ఉన్నాయని చెప్పిన వారిని సీబీఐ, లేదా ఇతర సంస్థల(other company)తో విచారించలేదని ప్రశ్నించారు.
ఏకపక్ష విచారణ…
సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించే వారినే పిలిపించడం చూస్తే విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని భూమన ఆరోపించారు. విచారణ వివరాలను గోప్యంగా ఉంచాలని నిబంధనలు(Terms) ఉన్నప్పటికీ, మరుసటి రోజునే పచ్చపత్రికల్లో లీకులు రావడం విచారకరమని అన్నారు. రవికుమార్ నుంచి ఒక్క టీ కూడా తాగలేదని, రుజువు చేస్తే రాజకీయాలు(politics) విడిచిపెడతా అని సవాల్ విసిరారు
డొనేషన్లు స్వీకరించడం టీటీడీ విధానం
డోనర్ల పూర్వాపరాలు తెలుసుకునే నియమం టీటీడీలో లేదని, ఎవరు ఇచ్చినా దేవాలయం స్వీకరిస్తుందని చెప్పారు. రవికుమార్ ఆస్తులు అవినీతి ఆస్తులైతే(corrupt assets) ప్రభుత్వం ఎందుకు తిరిగి ఇచ్చిపుచ్చుకోలేదు..? ఇప్పుడైనా వెనక్కి తీసుకోగలరా..?” అని ప్రశ్నించారు. అధికారులను ఉపయోగించి రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. విచారణ ఒత్తిడితో సతీష్ మరణించారని ఆరోపించారు. విచారణ పేరుతో భయపెట్టడం, బెదిరించడం వల్ల ఒక మంచి అధికారి సతీష్(Officer Satish) మృతి చెందారని ఆరోపించారు.
సుప్రీం కోర్టుపై కూడా వ్యాఖ్యలు
బీజేపీ–టీడీపీ అనుకూల మీడియా బెంచ్లా వ్యవహరిస్తోందని భూమన విమర్శించారు. ఓ టీవీ చానల్లోని చంద్రబాబు అనుచరులు సర్వోన్నత(supreme) న్యాయస్థానాన్ని కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి, భానుప్రకాశ్, అనగాని సత్య ప్రసాద్ లాంటి వారు పోలీసులు అవతారం ఎత్తి విచారణ చేయాల్సిందే” అంటూ వ్యంగ్యాస్త్రాలు(Satires) సంధించారు.
