మహిళా భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి తీరం

మహిళా భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి తీరం

స్నాన‌ ఘట్టాల వద్ద కార్తీక దీపాల కనువిందు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

భద్రాచలం ( ఆంధ్రప్రభ) : పవిత్ర కార్తీక పౌర్ణమి వేల భద్రాచలం గోదావరి తీరం కార్థిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజామునుంచే మహిళా భక్తులు.. రావడం ప్రారంభం కాగా కొద్దిసేపటికే స్నాన ఘట్టాల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా కొత్త వెలుగులు నిండాయి. మహిళలు భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించి, సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని.. కానుకలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ, పోలీస్ శాఖ ఏర్పాట్లు చేశాయి.

Leave a Reply