కార్తీక వన సమారాధన..

కార్తీక వన సమారాధన..

అశ్వరావుపేట రూరల్, (ఆంధ్రప్రభ):
కార్తీకమాస పర్వదినాన్ని పురస్కరించుకుని మున్నూరు కాపు, కాపు కులస్తుల కార్తీక వన సమారాధన కార్యక్రమం నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట పట్టణం నుండి భద్రాచలం రోడ్డులో పామాయిల్ తోటలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వేళ సంఘం సభ్యుల పరిచయ కార్యక్రమం, సమావేశం నిర్వహణ, వనభోజనాల ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా మధ్యాహ్నం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధి నాగబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మున్నూరు కాపు, కాపు కులస్తులు పాల్గొన్నారు.

Leave a Reply