Karimabad | అండర్ బ్రిడ్జ్ రోడ్డు అధ్వానం

Karimabad | అండర్ బ్రిడ్జ్ రోడ్డు అధ్వానం

రాకపోకలకు తీవ్రఇబ్బందులు
గుంతలు పూడ్చని జిడబ్ల్యూఎంసి
మేయర్, కమిషనర్ దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలి


Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరం (Warangal city)లోని అండర్ బ్రిడ్జి రోడ్డు గుంతల మయమై అద్వానంగా తయారైంది. ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. నూతన సిసి రోడ్లు వేయకున్నా కనీసం గుంతలు, గతుకులు పూడ్చి వేసి మరమ్మత్తులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. దక్షిణం వైపు వరంగల్ కు ప్రధాన రహదారి అండర్ బ్రిడ్జి రోడ్డు (Bridge Road) మాత్రమే. ఖమ్మం, మర్రిపెడ, తొర్రూర్ , నెక్కొండ, మహబూబాబాద్ వద్దన్నపేట సూర్య పేట, ప్రతినిత్యం వేలాదిమంది వరంగల్ నగరానికి రాకపోకలు కొనసాగిస్తారు. ఆర్టీసీ బస్సులు ఈ రూట్లోనే ఎక్కువగా రాకపోకలు కొనసాగిస్తాయి.. గుంతల మయమైన రోడ్లు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జీవులు తమ వాహనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనాల శాకబ్జర్స్ (Shakabgers) పాడైపోవడంతో పాటు ద్విచక్ర వాహనం నడిపేవారు తమ నడుము డిస్క్ బారిన పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ బ్రిడ్జి జంక్షన్ హంటర్ రోడ్డు నుండి అండర్ బ్రిడ్జి వైపు వచ్చిన, పోస్టాఫీస్ వైపు పోయిన ఎక్కడ చూసినా రహదారులన్నీ గుంతల మయంగా మారాయి. వారంలో రెండు మూడుసార్లు ఈ రూట్లో మేయర్, కమిషనర్ పర్యటిస్తూనే ఉంటారు. కానీ రోడ్డు మరమ్మతులపై దృష్టి కేంద్రీకరించడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి అండర్ బ్రిడ్జి (Underbridge) క్రింది నుండి నిత్యం మురికి నీరు ప్రవహిస్తున్న ఆ సమస్యను పట్టించుకోవడంలేదని రోజు రోజుకు అండర్ బ్రిడ్జి జంక్షన్ రోడ్డు గుంతలమయం దుర్వాసన వెదజల్తు నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అండర్ బ్రిడ్జి జంక్షన్ లోని గుంతలను పూడ్చివేసి రాకపోకలు సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నగర నగర ప్రజలు అధికారులను ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply