Kareemabad | శివనగర్‌లో సంక్రాంతి సందడి..

Kareemabad | శివనగర్‌లో సంక్రాంతి సందడి..
Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భోగి రోజు 34 డివిజన్ శివనగర్‌లో మహిళలు తమ ఇండ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు. ఈ రోజు భోగి పండగను పురస్కరించుకొని ఉదయమే భోగిమంటలు వేసుకొని అనంతరం తమ ఇంటి లోగిళ్లలో రకరకాల రంగవల్లి ముగ్గులు వేసి ఆకిళ్లను అందంగా తీర్చిదిద్దారు. శివనగర్‌లోని ప్రధాన రహదారిలో వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంది. ముగ్గులో పలు రకాల రంగులు ఉపయోగించి భారీ ముగ్గు వేసామని, శ్వేత, సరిత, అనిత తెలిపారు.
