kareemabad | రామాలయంలో బీజేపీ నాయకుల పూజలు

kareemabad | రామాలయంలో బీజేపీ నాయకుల పూజలు

  • శివలింగానికి పూజలు చేసిన మమ్మద్ రఫీ

kareemabad | కరిమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని శివనగర్ రామాలయంలో మెట్టు రామలింగేశ్వర స్వామికి బీజేపీ మండల అధ్యక్షుడు మహ్మద్ రఫీ, నాయకులు పూజలు చేశారు. ఈ రోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి కుమార్ సూచనల మేరకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ… సోమనాధ్ దేవాలయంపై ముష్కరుల దాడిని తిప్పికొట్టి తిరిగి నిలబడ్డ ధర్మం హిందూ దర్మమనినేటి తరానికి నాడు విదేశియిలు చేసిన విధ్వంసం, అకృత్యలను మరువకూడదని, అలాంటి వాటిని తిప్పి కొట్టిన చరిత్ర మనది అని మోదీ తెలియపరుస్తున్నారని గంట అన్నారు. వెయ్యేళ్ళ క్రితం సోమనాధ్ దేవాలయంపై జరిగిన దాడికి పరిహార పూజల్లో పీఎం మోదీ పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని వార్డుల్లో, బూత్ కమిటీల ఆధ్వర్యంలో శివాలయలో అభిషేకలు చేస్తున్నామని ఘంటా రవికుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సహస్ర సంకల్ప యాత్ర కి మద్దతుగా సోమనాథ్ స్వాభిమాన పర్వ్ – 2026 కార్యక్రమంలో భాగంగా వరంగల్ శివనగర్ మండల అధ్యక్షుడు మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో శివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభిషేకలు, పూజలు నిర్వహించిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ పాల్గొన్నారు. పూజ కార్యక్రమంలో బీజేపీ శివనగర్ మండల నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, ముత్తినేని రవి, బోడకుంట్ల శివశంకర్, టీవీ ఎల్ ఎన్ శ్రీనివాస్, శెట్టి రమేష్, కందుకూరి విజయ్ కుమార్, పోశాల సతీష్, మహిళా నాయకురాలు మార్త ఉషారాణి, తోట సాగరిక, శెట్టి స్రవంతి, పావుశెట్టి స్వరూప పాల్గొన్నారు.

Leave a Reply