రంగంలో రెండు పార్టీలు

రంగంలో రెండు పార్టీలు
- నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని జామ మజీద్ ఎదురుగా రెండవ వార్డు మూడవ వార్డు ఆరవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో కలిసి ప్రార్థన ముగించుకుని తర్వాత ముస్లిం సోదరులతో అలై బలై చేసి మీ మీ వార్డులలో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థులను మీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కౌన్సిల్లో కూర్చోబెట్టాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖానాపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేనున్నానని అన్ని మంచి చెడులు కావలసినన్ని నిధులు అభివృద్ధి పనులు ముందుండి చేయిస్తానని అభివృద్ధి చేసే అవకాశం మా కౌన్సిల్ కల్పియాలని కోరారు.
అనంతరం అక్కడికే చేరుకున్న టిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జూన్సన్ నాయక్ వారి అభ్యర్థులతో టిఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పిస్తే ఖానాపూర్ రూపురేఖలనే మార్చేస్తానని అధికారంలో లేకున్నా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని మీ ఆశీస్సులు ఆశీర్వాదం కావాలని కోరారు.
