Kamareddy | ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) – కామారెడ్డి జిల్లాలో ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సంజీవ్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో సీడీవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. తీరా.. లంచం ఇవ్వలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అయితే లంచం డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్‌తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈక్రమంలో పలువురు పోలీసు అధికారులను పిలిపించి వివరాలు ఆరాతీస్తున్నట్లు సమాచారం.
