Kamal l అడుగడుగునా కమల్ కు జననీరాజనం..

Kamal l అడుగడుగునా కమల్ కు జననీరాజనం..

గెలుపే లక్ష్యంగా దూసుకవెళ్తున్న నూకల కమల్

రెండవ వార్డులో జోరుగా ప్రచారం చేస్తున్న యువ న్యాయవాదులు

Kamal l మంథని, ఆంధ్ర ప్రభ : కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు అభ్యర్థి నూకల కమల్ ప్రచారానికి ప్రజలంతా అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. దుద్దిళ్ల సోదరుల ఆదేశాల మేరకు యువ న్యాయవాదులు, కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజాసేవ కోసం ముందుకొస్తున్నానని ఆశీర్వదించాలని ఆయన కోరారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే సేవకుడిలా పని చేస్తానని నూకల కమల్ అభ్యర్థించారు.

ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ప్రచారంలో భాగంగా నూకల కమల్ మాట్లాడుతూ…హస్తం గుర్తుకు ఓటెయ్యండి ప్రతి ఒక్కరికి అన్నలా అండగా ఉంటారని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయన గడపగడపన ప్రచారం చేస్తూ అందరికంటే ముందు ప్రచారంలో మెరుపు తీగల ముందుకు వెళ్తున్నారు. నూకల గెలుపు బారబరీ ఖాయమని పలువురు విశ్వసిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని వార్డు ప్రచారంలో అందరి కంటే ముందున్నారు. హస్తం గుర్తుకు ఓటెయ్యాలని సేవకుడిలా పని చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. వార్డు సందర్శన ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా కార్యచరణ ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply