కళ్యాణలక్ష్మి పథకం ఆడపడుచుల పెళ్లిళ్లకు వరం..

కళ్యాణలక్ష్మి పథకం ఆడపడుచుల పెళ్లిళ్లకు వరం..

  • తిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఆడపడుచుల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని తిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహఅన్నారు. శనివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండలపరిధిలోని త్రిప్రాస్ పల్లిలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు కళ్యాణలక్ష్మిచెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని తల్లిదండ్రులు ఎంతో కష్టపడితమ ఆడపడుచు పెళ్లి చేసి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేరుతో వారికి అండగాఉంటుందనిఅన్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో త్రిప్రాస్ పల్లి, బాపూర్ గ్రామాలను అన్ని రంగాల్లోఅభివృద్ధిచేస్తామన్నారు. ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి అందజేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు భగవంతు, ఆంజనేయులు, శంకర్ సత్యనారాయణ, సుదర్శన్, నర్సిములు, ఉషప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply