Kakinada | రంగ‌రాయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో లైంగిక వేధింపులు…

కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో (Rangaraya medical college) విద్యార్థినులపై (Girl students ) కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు (harassment ) పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. బీఎస్సీ (Bsc) , డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (lab technology ) కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ (faculty ) వద్ద చెప్పుకుని విలపించారు. ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు. ఈ కమిటీ (committee) నివేదిక సమర్పించాల్సి ఉంది.

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సిబ్బందిలో ఇద్దరు బెదిరించినట్టు కూడా తెలిసింది. తాను శాశ్వత ఉద్యోగినని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ల్యాబ్ సహాయకుడు ఒకరు విద్యార్థినులను బెదిరించినట్టు కూడా సమాచారం. అంతేకాదు, కొందరు ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని కూడా కమిటీకి తెలిపారు. అయితే, తాము ఎవరిపట్లా అసభ్యంగా ప్రవర్తించలేదని విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. వేధింపుల వ్యవహారం నిజమేనని, విచారణ జరిపించామని, ఇందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉందని ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ చెప్పారు. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం అంగన్‌వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిన లక్షిత్ దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయాడని ఎస్పీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే జాగిలాలు, డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టామని, డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను నియమించి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించామని ఎస్పీ వివరించారు. అడవిలో చిక్కుకుపోయి రెండు రోజులపాటు ఆహారం, నీరు అందక లక్షిత్ మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశించారు. తల్లి కాన్పు కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన లక్షిత్, అక్కడ అనధికారికంగా అంగన్‌వాడీ సెంటర్‌కు వచ్చి పోతున్నాడు. ఈ దుర్ఘటనలో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం ఉందా అనే అంశంపైనా దర్యాప్తు జరపాలని సిఎం ఆదేశించారు.

Leave a Reply