Kadem | గొర్రెలకు నట్టల నివారణ మందు తాగించాలి

Kadem | గొర్రెలకు నట్టల నివారణ మందు తాగించాలి
- కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ పి సౌందర్య
Kadem | కడెం, ఆంధ్రప్రభ : మేకలకు, గొర్రెలకు నట్టల నివారణకై నట్టల మందును తాగించాలని కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ ఈ సౌందర్య అన్నారు. మంగళవారం కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలలో, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ సౌందర్య మాట్లాడుతూ… గొర్రెల పెంపకందారులందరూ తమ జీవాలకి నట్టల నివారణ మందులు తాగించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాన్ని లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ ప్రారంభించారు. డాక్టర్ సౌందర్య మాట్లాడుతూ… ఈనెల 23 నుండి జనవరి 2 వరకు మండలంలోని ప్రతి గ్రామంలో ఉచిత నట్టల నివారణ మందు శిబిరాలు నిర్వహిస్తున్నామని, అందువల్ల గొర్రెల, మేకల పెంపకందారులపై శిబిరాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ మద్దిపడగ జేవీఓ లు జె రాజేశ్వర్, విజయ ఓఎస్ రాజేశ్వర్, గోపాలమిత్ర, బి.రమేష్, రైతులు, నాయకులు, మేకల గొర్రెల పెంపకందారులు పాల్గొన్నారు.
