kadem | కళాకారుడు కే శ్రీనివాస్ కు సన్మానం..

kadem | కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గత మూడు నాలుగు రోజుల నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కళా ఉత్సవాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కళా ఉత్సవాల్లో భాగంగా కడెం మండలంలోని ఏలగడప గ్రామంలో గల ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం కళాకారుడు కూచనపల్లి శ్రీనివాస్ దుర్యోధనుని మయసభ ఏకపాత్రాభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు.
వేషధారణ, హావభావాలు, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయని.. అంతరిస్తున్న కలను ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కళాకారుడు కూచనపల్లి శ్రీనివాస్ ను అందరూ అభినందిస్తున్నారు. నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి భోజన్న, కళా ఉత్సవ కమిటీ అధ్యక్షులు పద్మ, అంతర్జాతీయ కళాకారుడు నల్లరామ్ రెడ్డి పూల రాములు శంకర్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు.
