Kadem | 108 అంబులెన్స్ సేవలను తనిఖీ

Kadem | 108 అంబులెన్స్ సేవలను తనిఖీ
Kadem | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలో ఈఎమ్ఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సేవలను మండల కేంద్రమైన కడెంలో ఈ రోజు ప్రోగ్రాం మేనేజర్ ఎన్ జనార్ధన్, జిల్లా కోఆర్డినేటర్ (ఈఎంఈ) రంగాచారి పరిశీలించారు. ఈ తనిఖీలో అంబులెన్స్ కార్యకలాపాలు, సిబ్బంది పనితీరు, ప్రీ-హాస్పిటల్ కేర్ సేవల అమలును పై అధికారులు సమీక్షించారు. 108 సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఇంకా ఎక్కువ మందికి వేగంగా సేవలు అందేలా ట్రిప్స్ సంఖ్యను పెంచాలని, ప్రీ-హాస్పిటల్ కేర్‌ను మరింత మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్ధిదారులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో కడం 108 అంబులెన్స్ ఈఎంటి మురళి, పైలట్ వసంత్ పాల్గొన్నారు.
