Kadem | ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలి…

Kadem | ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలి…
Kadem | కడెం( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావును కొత్త సదర్ మాట్ ఆనకట్ట దగ్గర సదర్ మాట్ చివరి ఆయకట్టు రైతు నేత రాజేందర్ హపావత్, రైతులు గద్దెల దేవన్న, పల్లె సత్తన్న, కన్నె గంగన్న, సదానందం, కానూరి సతీష్, ముక్కెర శ్రీనివాస్, కొండ శంకర్ కలిశారు. సదర్ మాట్ కాలువ ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు వినతి పత్రాలు రైతులు అందజేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి ప్రత్యేక కాలువ సాద్య అసాద్యాలపై సర్వే చేయాలని నీటిపారుదల శాఖ సిఈనీ ఆదేశించారు. అలాగే చివరి ఆయకట్టు రైతాంగానికి రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరారు.
