Kadem | రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి
Kadem | కడెం, ఆంధ్రప్రభ : హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన సంపంగి వెంకటస్వామి( 53) మృతి చెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడెం మండల కేంద్రానికి చెందిన సంపంగి వెంకటస్వామి గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్ మూసాపేట్ లో ఉంటూ సినిమా థియేటర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నాడు. కాగా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటస్వామి తన బైక్ పై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంలో వెంకటస్వామి అక్కడికక్కడే చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ కలిసి మెలిసి ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ అందరి మన్ననలు పొందిన వెంకటస్వామి ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కడెం పెద్దూర్ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
వెంకటస్వామి అంత్యక్రియలు హైదరాబాదులోనే నిర్వహించనున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ డి కొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, మాజీ సర్పంచ్ కొండాపురం అనూష లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఆజాం, పలువురు పెద్దూర్ జిపి వార్డ్ సభ్యులు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వెంకటస్వామి కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

