kaddam | కొలువుదీరారు..

kaddam | కొలువుదీరారు..
- పెద్దూరు జీపీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
kaddam | కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ కడెం పంచాయతీ పాలకవర్గం కొలువుదీరింది. గ్రామ సర్పంచ్‌గా దీకొండ విజయకుమార్, ఉప సర్పంచ్‌గా పిట్టల రాజన్న, వార్డు సభ్యులు గూగుల వత్ మౌనిక, అపావత్ రాజేష్, కత్తెరపాక రాజశేఖర్, ఎస్‌కే నయిమా బేగం, ఎస్.కె నయీమ్, గట్ల స్వరూప, అట్ల సరోజ, గొల్ల లావణ్య, ఎంఏ సాహిస్తా, పర్వీన్ ఎండి జుబేర్ ఖాన్, అత్రం శ్రీనివాస్‌లతో ఎంపీఓ టి. శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పాలక వర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు అందరి సహకారంతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పంచాయతీ సెక్రెటరీ ఎండి మునురుల్ హాసన్ పాల్గొన్నారు.
