K.V. Ramakrishnaiah | రేపు జాతీయ లోక్ అదాలత్
K.V. Ramakrishnaiah | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ (Lok Adalat) నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ. రామకృష్ణయ్య తెలిపారు. గతంలో 16,621 కేసులు పరిష్కరించామన్నారు. ఈసారి కేసులను పరిష్కరించేందుకు 42 ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్రిమినల్, రాజీపడదగిన కేసులు, మోటార్ క్లెయిమ్స్, చెక్ బౌన్స్, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.

