- 12.96 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తి
- ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి విశాఖ అథ్లెట్
విశాఖకు చెందిన జ్యోతి ఎర్రాజీ ఏషియన్ అథ్లెటిక్స్ మీట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కొరియాలో జరుగుతున్న 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2025లో జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.
ఈ మహిళల మీట్‌లో కేవలం 12.96 సెకన్లలోనూ గమ్యాన్ని పూర్తి చేసి ఆసియాలో సరికొత్త రికార్డ్‌కు తెర తీసింది. జ్యోతి తర్వాత 13.07 సెకన్లులో రెండో స్థానాన్ని, 13.07 సెకన్లలో మూడవ స్థానాల్ని జపాన్, చైనాకు చెందిన క్రీడాకారులు దక్కించుకున్నారు.
ఇక ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్‌షిప్ టోర్నీలలో పతకాలు సాధించడమే కాకుండా ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి విశాఖ అథ్లెట్ కూడా జ్యోతి ఎర్రాజీ కావడం విశేషం. గతంలో కూడా జ్యోతి ఎర్రాజీ అద్భుతాలు సృష్టించింది.
సాధారణ కుటుంబానికి చెందిన జ్యోతి అంచెలంచెలుగా తాను పాల్గొన్న అన్ని జాతీ య, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి.. ఇటీవలే అర్జున అవార్డుకు ఎంపికయ్యింది.
ఈ సందర్భంగా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు తదితరులు అభినందించారు.