​గుండ్లపోచంపల్లిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మేడ్చల్, ఆంధ్రప్రభ : ​సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పూలే సేవలను కొనియాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సామాజిక విప్లవం అంటరానితనం, కుల వివక్ష లేని సమాజం కోసం పూలే చేసిన పోరాటం మరువలేనిదని అణగారిన వర్గాలకు, ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన వేసిన పునాదులే నేటి అభివృద్ధికి మూలమని పేర్కొన్నారు. సమాజంలో సానుకూల మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం జైపాల్ రెడ్డి, బేరి బాలరాజు,వివిధ పార్టీల నాయకులు కృష్ణ గౌడ్, రవీందర్ గౌడ్, రామారావు, సురేష్, సంజీవ్ గౌడ్, హరికృష్ణ, అరుణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply