హైదరాబాద్ – తెలంగాణలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇరువైపులా వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు బుధవారం నాడు తీర్పును వెలువరించింది. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. 10 లక్షల రూపాయలని అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాలలోకి వెళితే …
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం నరేంద్ర పురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నాడు. స్థానికంగా మైసమ్మ దేవాయంలో పూజారిగా ఉంటూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివాసముం టున్నది. గతంలో పలు సినిమాలు, సీరియ ల్స్‌లో చిన్న పాత్రల్లో నటించిన అప్సర ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నది.
భక్తురాలిగా పరిచయమై…
పూజారి సాయికృష్ణ పని చేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని అప్సర తరచూ సాయికృ ష్ణపై ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. పథకం ప్ర కారం 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలం లోని సుల్తాన్‌పల్లి శివారులోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి చేరుకున్నాడు. కారులోనే గాఢనిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్‌తో ఊపిరి ఆడకుండా చే సేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో మృతదేహం
అప్సర మృతదేహాన్ని కారు బాడీ కవరులో చుట్టి డిక్కీలో వేసుకొని ఇంటి వద్దకు చేరుకున్నాడు. సాయంత్రం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్‌నగర్ ఎమ్మా ర్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురి గురిం చి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్‌లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్టు నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసి నా స్పందించడంలేదని నటించాడు. ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు.
ప్రేయసి అప్సరను చంపిన పూజారి వెంకట సాయి కృష్ణ కేసులో శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వాదనలు వినిపించారు. “ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. అందులో 28 మంది సాక్షులను పరిగణలోనికి తీసుకుంది కోర్టు. వెంకట సాయి కృష్ణ అప్సరను హత్య చేశాడు అనడానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు మిగతా ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంకట సాయి కృష్ణ వినిపించిన వాదనలను కోర్టు పరిగణలోనికి తీసుకోలేదు. దేవాలయం పూజ కోసం వచ్చిన ఆప్సరను ఏ విధంగా ట్రాప్ చేశాడు? ఏ విధంగా ఆమెను కాశీకి తీసుకొని వెళ్తానని చెప్పి హత్య చేశాడు? పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచాం. వెంకట సాయి కృష్ణకి అప్సర సత్యం కేసులో జీవిత ఖైదు తో పాటు సాక్ష్యాధారాలను తారుమారు చేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటుగా అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఆదేశాలలో పేర్కొంది.” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వెల్లడించారు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ బలమైన వాదనతోనే …
ప్రేయసి అప్సరను చంపిన పూజారి వెంకట సాయి కృష్ణ కేసులో శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వాదనలు వినిపించారు. తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. అందులో 28 మంది సాక్షులను పరిగణలోనికి తీసుకుంది కోర్టు. వెంకట సాయి కృష్ణ అప్సరను హత్య చేశాడు అనడానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు మిగతా ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంకట సాయి కృష్ణ వినిపించిన వాదనలను కోర్టు పరిగణలోనికి తీసుకోలేదు. దేవాలయం పూజ కోసం వచ్చిన ఆప్సరను ఏ విధంగా ట్రాప్ చేశాడు? ఏ విధంగా ఆమెను కాశీకి తీసుకొని వెళ్తానని చెప్పి హత్య చేశాడు? పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచాం. వెంకట సాయి కృష్ణకి అప్సర సత్యం కేసులో జీవిత ఖైదు తో పాటు సాక్ష్యాధారాలను తారుమారు చేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటుగా అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఆదేశాలలో పేర్కొంది.” అని వెల్లడించారు.