Jubilee Hills | ఆర్టీసీ బ‌స్సు బీభ్సతం.. ఒకరు మృతి

Jubilee Hills | ఆర్టీసీ బ‌స్సు బీభ్సతం.. ఒకరు మృతి


Jubilee Hills | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ఆర్టీసీ బస్సు (RTC bus) బీభత్సం సృష్టించడంతో ఒకరు మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్ పరిధి వెంకటగిరిలో జరిగింది. ఓ పాదచారిపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

చనిపోయిన వ్యక్తి నాని కిచెన్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ రోడ్డు ప్రమాదంతో వెంకటగిరి (Venkatagiri) లో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply