Jubilee Hills | కాంగ్రెస్ పాల‌న‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు

Jubilee Hills | కాంగ్రెస్ పాల‌న‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు

  • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిదర్శనం : పీసీసీ

Jubilee Hills | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అందువల్లే ఈ గెలుపు సాధ్యం అయిందని తెలిపారు.

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు నిదర్శనం అని, కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద‌ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply