నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
ఢిల్లీ, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలు నవంబర్ 11న నిర్వహించబడగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన జూన్ 8న అనారోగ్యంతో కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి హైకమాండ్‌కు పంపింది. వీరిలో ఒకరిని ప్రకటించడంపై పార్టీ హైకమాండ్ వచ్చే ఒకటి లేదా రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.