Jubilee Hills | కొత్త పార్టీకి ముహూర్తం..

Jubilee Hills | కొత్త పార్టీకి ముహూర్తం..
- మొదటి ఛాయిస్ సిద్దిపేట
- రెండో ఛాయిస్ బోధన్
Jubilee Hills | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని కవిత అన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండో ఛాయిస్ బోధన్ అన్నారు. కవిత గత కొన్నిరోజులుగా ‘జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేయించి తమ ఉనికిని చాటుకున్నారు.
