పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి
- కౌన్సిలర్ దంపతులను సన్మానించి, చీర బహుకరించిన జర్నలిస్టు నాగరాజు .
మోత్కూరు, ఆంధ్రప్రభ ; ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని జర్నలిస్టు గాదెనబోయిన నాగరాజు అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో 8 వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డిలను వార్డులోని రైతులతో కలిసి పూలమాలలు, శాలువాతో పాటు శ్రీవిద్యకు చీరను బహూకరించి ఘనంగా సన్మానించారు. 8 వందల పైచిలుకు మెజార్టీతో కౌన్సిలర్ గా గెలుపొందడం గొప్ప విషయం అని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్నేహితుడైన పన్నాల శ్రీనివాస్ రెడ్డి డిగ్రీ పూర్తి అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడని, ఉద్యోగం నచ్చక దానికి రాజీనామా చేసి ఊర్లో ఒకవైపు వ్యవసాయం పనులు చేసుకుంటూ… మరొక వైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వాడని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి పని చేసి జిల్లా కాంగ్రెస్ నాయకునిగా ఎదిగాడని తెలిపారు.
మార్కెట్ డైరెక్టర్ గా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి భార్య పన్నాల శ్రీవిద్య కూడా శ్రీనివాస్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. 8 వ వార్డులో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి మురుగు కాలువలు, నూతనంగా వీధులలో రోడ్లు, సీజనల్ సమయంలో దోమల నివారణ మందులు కొట్టించడం వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించాలన్నారు. వార్డులోని దివ్యాంగులకు, వృద్ధులకు నూతనంగా పెన్షన్లు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి రాజాలు, అవిశెట్టి నాగరాజు, రిటైర్డ్ ఉద్యోగి నాయిని శంకర్, రైతులు కౌకుంట్ల మల్లారెడ్డి, ఆకుల సాయిలు, సోమ సత్తి, ఎడ్ల చంద్రయ్య, కొప్పుల ప్రేమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
